సంచలనం సృష్టించిన తెలుగు సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసులో మళ్ళీ కదలిక వచ్చింది. అకున్ సభర్వాల్ నేతృత్వంలో ఈ కేసులను దర్యాప్తు చేసిన సిట్ అధికారులు ముగ్గురు సినీ ప్రముఖులపై శుక్రవారం నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్స్ దాఖలు చేశారు. సిట్ బృందం గత ఏడాది ఆగస్ట్ నెలలో దర్శకుడు పూరీ జగన్నాద్, నటులు రవితేజ, ఛార్మీ, సుబ్బరాజు, తరుణ్, నందు, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, కెమెరా మ్యాన్ శ్యాం కె నాయుడులను విచారించింది. వారిలో దర్శకుడు పూరీ జగన్నాద్, నవదీప్, సుబ్బరాజుల రక్తం, గోళ్ళు, జుత్తు శాంపిల్స్ ను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. డానికి సంబంధించిన నివేదిక రావడంతో సిట్ అధికారులు వారి ముగ్గురిపై నిన్న ఛార్జ్-షీట్స్ దాఖలు చేసినట్లు సమాచారం. కనుక ఈ డ్రగ్స్ కేసులో మళ్ళీ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.