సంబంధిత వార్తలు
కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ తమ శాసనసభ్యత్వం రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయలేదు. అలాగే హైకోర్టు ఆదేశానుసారం శాసనసభలో రికార్డయిన వీడియో ఫుటేజిని సమర్పించకపోవడంతో హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 9వ తేదీన దీనిపై మళ్ళీ విచారణ చేపడతామని, ఒకవేళ అప్పటిలోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోతే ప్రభుత్వానికి ఆసక్తిలేదని భావించి తదనుగుణంగా తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి హెచ్చరించారు.