కెసిఆర్ బ్యాంకులను మోసం చేశారు: జైపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీప్రజా చైతన్య యాత్ర పేరిట మొదలుపెట్టిన బస్సు యాత్ర సోమవారం రాత్రి పెద్దపల్లికి చేరింది. అక్కడ జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్, తెరాస సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. వారిలో సీనియర్ నేత జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ బ్యాంకులకు కూడా అబద్దాలు చెప్పి మోసం చేశారు. గతంలో బ్రెజిల్ దేశాధ్యక్షుడు కూడా ఈవిధంగానే మోసపూరితంగా 20 కోట్లు అప్పులు చేసినందుకు ఆ దేశప్రజలు తిరగబడి ఆయనను పదవి నుంచి తొలగించారు. మరి కెసిఆర్ ను ఏమి చేయాలో తెలంగాణా ప్రజలే నిర్ణయించుకోవాలి,” అని అన్నారు. 

పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, జీవన్ రెడ్డి, డికె అరుణ, డి.శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్, ఆరేపల్లి మోహన్, దానం నాగేందర్, ప్రవీణ్ రెడ్డి, టి.సంతోష్ కుమార్ తదితరులు ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. వారిలో ఒక్కొక్కరూ ఒక్కో అంశంపై మాట్లాడుతూ కెసిఆర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికలలో తెరాస సర్కార్ ను గద్దె దించడం ఖాయమని అందరూ ముక్తకంఠంతో చెప్పారు.