హెచ్.సి.యు. వైస్ ఛాన్సిలర్ హత్యకు కుట్ర

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ అప్పారావును హత్య చేయడానికి మావోయిస్టులు కుట్ర పన్నినట్లు పోలీసులు అప్రయత్నంగా కనుగొన్నారు. పోలీసులు అప్పుడప్పుడు రోడ్లపై వెళ్ళే వాహనాలను ఆకస్మిక తనికీలు చేస్తుంటారు. వారు శనివారం భద్రాచలం-చర్ల రోడ్డుపై తనికీలు నిర్వహిస్తుండగా ఒక కారులు చంద్రన్ మిశ్రా, పృథ్వి రాజ్ అనే ఇద్దరు వ్యక్తుల తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులో తీసుకొని ప్రశ్నించగా వైస్ ఛాన్సిలర్ అప్పారావును హత్య చేయడానికి జరుగుతున్న కుట్రను బయటపెట్టారు.