అవన్నీ పుకార్లే: లక్ష్మీనారాయణ

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడంతో అయన రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నారని, జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అయన వాటిని ఖండించారు. తను స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకొన్న మాట వాస్తవమే కానీ జనసేన పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తన రాజీనామా లేఖను మహారాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని, అది ఆమోదించిన తరువాతే తన భవిష్య కార్యాచరణను తెలియజేస్తానని లక్ష్మీనారాయణ మీడియాకు చెప్పారు. 

మీడియాలో వచ్చిన వార్తలను చూసిన పవన్ కళ్యాణ్ ఒకవేళ అయన జనసేనలో చేరితే సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పారు. కానీ లక్ష్మీనారాయణ తనకు ఆ ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. బహుశః ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనవచ్చని సన్నిహితులు చెపుతున్నారు.