కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల కమీషనర్ ఒం ప్రకాష్ రావత్ డిల్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 228 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మే 28వ తేదీతో ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ పాలనకు గడువు ముగుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ ఈవిధంగా ఉంది: 

ఎన్నికల నోటిఫికేషన్: ఏప్రిల్ 17, నామినేషన్స్ స్వీకరన: ఏప్రిల్ 24 నుంచి. నామినేషన్స్ ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 27, నామినేషన్స్ పరిశీలన: ఏప్రిల్ 28, పోలింగ్: మే 12, ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి మే 15వ తేదీ.

నేటి నుంచే కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు ఎన్నికల కమీషనర్ ప్రకటించారు. 

ఓటర్ల సంఖ్య: 4.96 కోట్ల మంది, పురుష ఓటర్లు: 2.51 కోట్లు, మహిళా ఓటర్లు: 2.45 కోట్లు మంది.