నాకూ ఎంట్రీ ఇవ్వాలని ఉంది: సుమన్

తెలుగు, తమిళ సినిమాలలో నటించి అందరినీ మెప్పించిన విలక్షణ నటుడు సుమన్ తనకు కూడా రాజకీయాలలోకి రావాలని ఉందని చెప్పారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాలలోకి రావాలనుకొంటున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వానిస్తే తెరాసలో చేరుతానని అన్నారు. ఆయన తెరాసలో చేరుతానంటే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ టికెట్ కావాలంటే మాత్రం తప్పక అభ్యంతరాలు వ్యక్తం కావడం ఖాయం. ఎందుకంటే తెరాసలో ఇప్పటికే టికెట్స్ కోసం చాలా మంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. సుమన్ కు అటు ఆంధ్రాలో కూడా మంచి ఆదరణ ఉంది కనుక జనసేన పార్టీలో చేరి 2019 ఎన్నికలలో విశాఖపట్నం నుంచి శాసనసభకు పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు ఆ మద్యన వార్తలు వచ్చాయి.