కౌలు రైతులకు తప్ప అందరికీ ఇస్తాం: పోచారం

సోమవారం శాసనసభలో జీరో అవర్ లో రైతులకు పంట పెట్టుబడి గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సవివరంగా సమాధానాలు చెప్పారు.

1. రాష్ట్రంలో మొత్తం 72,13,111 మంది రైతులకు పంట పెట్టుబడి అందుకోబోతున్నారు.

2. ఈసారి బడ్జెట్ లో దీని (వ్యవసాయం) కోసం రూ.12,000 కోట్లు కేటాయించాము.

3. ప్రజా ప్రతినిధుల ద్వారా చెక్కులను రైతులకు అందజేస్తాము.

4. ఏప్రిల్ 20వ తేదీన మొదటి పంటకు, మళ్ళీ నవంబర్ 20న రెండవ పంటకు పెట్టుబడి అందిస్తాము.

5. వరి, పత్తి, వేరుశనగ, చెరుకు ఇతర సాధారణ పంటలతో పాటు పండ్ల తోటలకు కూడా దీనిని వర్తింప జేస్తున్నాము.

6. కౌలు రైతులకు ఇది వర్తించదు. భూమి యజమానులకే పంట పెట్టుబడి ఇస్తాము. కనుక వారు దీని గురించి సదరు భూయజమానులతో మాట్లాడుకొని సర్దుబాటు చేసుకోవాలి.

7. కోర్టు వివాదాలలో ఉన్న భూములలో సాగు చేస్తున్న రైతులకు కూడా పంట పెట్టుబడి ఇస్తాము. కానీ కోర్టు తుదితీర్పు తరువాతే ఇస్తాము.