శశికళకు 15 రోజులు పెరోల్

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్న మాజా అన్నాడిఎంకె నేత శశికళకు 15 రోజులు పెరోల్ మంజూరయింది. ఆమె భర్త ఎం.నటరాజన్ ఈరోజు తెల్లవారుజామున చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో మరణించారు. అయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆమెకు న్యాయస్థానం పెరోల్ మంజూరు చేయడంతో ఆమె ఈరోజు మధ్యాహ్నం బెంగళూరు పరపన్న అగ్రహార జైలు నుంచి కారులో నేరుగా తంజావూర్ బయలుదేరారు. నటరాజన్ అంత్యక్రియలు బుధవారం ఉదయం తంజావూర్ లో జరుగుతాయి.