త్వరలో గుత్తా బాధ్యతలు స్వీకరణ

తెలంగాణా రైతు సమన్వయ సమితికి చైర్మన్ గా నియమింపబడిన ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి మార్చి 12వ తేదీన సాయంత్రం 4 గంటలకు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. హైదరాబాద్ లోని వ్యవసాయ కమీషనరేట్ కార్యాలయంలో జరుగబోయే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, తెరాస సీనియర్ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. 

ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు జోడు పదవులలో కొనసాగకూడదు కనుక గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఎంపి పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది. ఒకవేళ చేయకపోతే కాంగ్రెస్ నేతలు లోక్ సభ స్పీకర్, ఎన్నికల సంఘానికి పిర్యాదులు చేయకుండా విడిచిపెట్టరు.