రాష్ట్రంలో ఆర్ధికంగా వెనుకబడిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించుకొనేందుకు ఇస్తున్న రుణాలపై ఇస్తున్న సబ్సీడీని ముఖ్యమంత్రి కెసిఆర్ మరింత పెంచారు. దానికి సంబందించిన ఫైలుపై గురువారం సంతకం చేశారు.
ఇంతవరకు ఆర్ధికంగా వెనుకబడిన నిరుద్యోగ యువతకు లక్ష రూపాయల రుణంపై రూ.60,000 రాయితీ ఇచ్చేవారు. ఇప్పుడు లక్షకు రూ.80,000, రెండు లక్షల రుణంపై రూ.1.40 లక్షలు, రూ.2-12 లక్షల రుణంపై గరిష్టంగా రూ.5 లక్షలు రాయితీ ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.
గత ఏడాది బడ్జెట్ లో దీని కోసం ఎంబిసి కార్పోరేషన్ కు రూ.1,000 కోట్లు కేటాయించామని ఈసారి బడ్జెట్ లో కూడా బారీగానే కేటాయిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి కల్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు.