
ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు కొత్తకొత్త రాజకీయపార్టీలు పుట్టుకువస్తుంటాయి. అది సహజమే. తెలంగాణాలో కూడా కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షుడుగా తెలంగాణా ప్రజల పార్టీ (టిపిపి) ఏర్పాటయింది. ఆదివారం హైదరాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన పార్టీ ఆవిర్భావసభలో జస్టిస్ చంద్రకుమార్ తన పార్టీ పేరు, జెండా, ఆశయాలను, కార్యవర్గ సభ్యుల పేర్లను ప్రకటించారు.
రాష్ట్రంలో బడుగుబలహీన వర్గాలకు రాజ్యాధికారం, ఉచిత విద్యావైద్య సౌకర్యాలు కల్పించడం, అవినీతి రహిత పాలన అందించడమే తమ పార్టీ లక్ష్యమని జస్టిస్ చంద్రకుమార్ చెప్పారు.
ఈ పార్టీకి అధ్యక్షుడు: జస్టిస్ చంద్రకుమార్
ఉపాధ్యక్షులు: వేద వికాస్, సుతారి లచ్చన్న, ముప్పారపు ప్రకాశ్, మోహన్‌రాజ్, రవీంద్ర,
ప్రధాన కార్యదర్శి: డాక్టర్ డి.సాంబశివగౌడ్
సెక్రెటరీ జనరల్: డాక్టర్ టివి రామనర్సయ్య
ఆర్గనైజింగ్ సెక్రెటరీ: ఏలేశ్వరం వెంకటేశ్, జైరాజ్, డి భద్రయ్య, సురేశ్‌బాబు, రవీందర్
జాయింట్ సెక్రటరీ: ఏ సందీప్‌కుమార్, పుట్టయ్య, రాజన్న, ఎండీ ఆహ్మాద్, స్వామి
కోశాధికారి: రఘు.
ఇంకా మహిళా, రైతు, యువజన తదితర విభాగాలకు కార్యదర్శులు, సభ్యుల పేర్లను ప్రకటించారు. రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో అన్ని స్థానాలకు తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు.