ఈశాన్యంలో ఎవరు పాగా వేస్తారో?

ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, త్రిపుర, మేఘాలయా శాసనసభ ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 

త్రిపుర అసెంబ్లీలో 60 స్థానాలుండగా అధికార సిపిఐ(ఎమ్మెల్యే) 29, భాజపా 25 స్థానాలలో ఆధిక్యంలో కనసాగుతుండగా కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యత సాధించలేకపోయింది. ఇక మేఘాలయలో 60 స్థానాలుండగా కాంగ్రెస్ 21, భాజపా-4, ఎన్.సి.పి-8, ఇతరులు 14 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నారు. నాగాలాండ్ లో ఎన్.పి.ఎఫ్-29, ఎన్.సి.పి.పి-20, కాంగ్రెస్-1 స్థానంలో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికలతో ఈశాన్య రాష్ట్రాలలో పాగా వేయడానికి భాజపా చాలా గట్టి ప్రయత్నాలే చేసినప్పటికీ ఒక్క త్రిపురలో మాత్రమే గట్టి పోటీనివ్వగలిగింది. మేఘాలయ కాంగ్రెస్ హస్తగతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.