నేడు ఫేస్ బుక్ లైవ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఫేస్ బుక్ లైవ్ కార్యక్రమంలో నెటిజన్స్ తో ముఖాముఖి చర్చా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయన వ్యక్తిగత ఫేస్ బుక్ పేజి ‘నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి’ తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారిక పేజి ‘తెలంగాణా కాంగ్రెస్’ పేజిలో కూడా ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆయనతో మాట్లడదలచుకొన్నవారు ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఫేస్ బుక్ లైవ్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. 

 ‘ప్రజా చైతన్య యాత్ర’ పేరిట రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చేస్తున్న బస్సు యాత్ర తదుపరి షెడ్యూల్ ను శుక్రవారం గాంధీ భవన్ ప్రకటించింది. రేపు అంటే మార్చి 4న భోధన్, 5న ఆర్మూర్, బాల్కొండ,మెట్ పల్లి, 7న సిరిసిల్లా, మానకొండూరు, 8న హుస్నాబాద్, హుజురాబాద్ నియోజకవర్గాలలో బస్సు యాత్ర సాగుతుందని ప్రకటించారు.