అలా ఎందుకు బెదిరించాడో?

శుక్రవారం సాయంత్రం తెరాస ప్రధాన కార్యాలయం తెలంగాణా భవన్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ భవనాన్ని బాంబుతో పేల్చివేస్తామని ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది బంజారా హిల్స్ పోలీసులకు ఈవిషయం తెలియజేశారు. పోలీసులు, బాంబు స్క్వాడ్స్, క్లూస్ టీమ్స్ హుటాహుటిన అక్కడకు చేరుకొని తెలంగాణా భవన్ లో క్షుణ్ణంగా తణికీలు నిర్వహించి భవనం లోపల ఎటువంటి ప్రేలుడు పదార్ధాలు లేవని నిర్ధారించారు.        

మరోపక్క సైబర్ పోలీసులు తెలంగాణా భవన్ కు ఫోన్ చేసి బెదిరించిన ఆ వ్యక్తి సెల్ నెంబర్ ఆధారంగా ఎస్సార్ నగర్, యూసఫ్ గూడా పరిసర ప్రాంతాల నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు గుర్తించి వెతికి పట్టుకొన్నారు. అతను అదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గురించారు. అతనిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ పార్టీలకు, నేతలకు అప్పుడప్పుడు ఇటువంటి బెదిరింపు కాల్స్ రావడం సహజమే కానీ అతను ఈవిధంగా ఎందుకు చేశాడో? పోలీసుల విచారణలో తెలుస్తుంది.