తెలంగాణా-ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో శుక్రవారం ఉదయం బారీ ఎన్కౌంటర్ జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం మండలంలో తడపాలగుట్ట-ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని పూజారికాంకేడ్ అనే అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం ఈ ఎన్కౌంటర్ జరిగింది
తెలంగాణా గ్రేహౌండ్ దళాలకు, మావోయిస్టులకు మద్య జరిగిన కాల్పులలో 12 మంది మావోయిస్టులు, సుశీల్ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు. మరో ముగ్గురు కానిస్టేబుల్స్ తీవ్రం గాయపడ్డారు. చనిపోయినవారిలో మావోయిస్టు అగ్రనేతలు బడే చొక్కారావు, హరిభూషణ్ అయన భార్య సమక్క అలియాస్ జ్యోతి ఉన్నట్లు పోలీసులు దృవీకరించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో రూ.41,000 నగదు, కొన్ని తుపాకులు, ఒక ల్యాప్ టాప్, ఒక స్కానర్ వగైరాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకొని పారిపోయిన మావోయిస్టుల కోసం గ్రే హౌండ్ దళాలు అటవీ ప్రాంతంలో గాలిస్తున్నాయి.