కంచి పీఠాదిపతి జయేంద్రసరస్వతి నిర్యాణం

కంచి కామకోటి పీఠాదిపతి జయేంద్ర సరస్వతి (82) బుధవారం ఉదయం నిర్యాణం చెందారు. అయన గత కొంతకాలంగా శ్వాసకోశవ్యాధితో బాధపడున్నారు. మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవడంతో శిష్యులు ఆయనను కంచి మఠానికి చెందిన ఆసుపత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందించినప్పటికీ అయన కోలుకోలేకపోయారు. ఈరోజు ఉదయం 9 గంటలకు నిర్యాణం చెందారు. 

జయేంద్ర సరస్వతి 1935, జులై 18న తమిళనాడులోని తంజావూరులో జన్మించారు. అయన అసలు పేరు సుబ్రహ్మణ్య మహాదేవ అయ్యర్‌. 1954, మార్చి 24న కంచి పీఠానికి 69వ పీఠాధిపతిగా నియమితులయ్యారు. కంచి మఠం అధ్వర్యంలో అనేక ఆసుపత్రులు, పాఠశాలలు నడుస్తున్నాయి. జయేంద్రసరస్వతి కంచి పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంచి మఠం సామాజిక సేవా కార్యక్రమాలు పెరిగాయి.