కలెక్టర్ ఆమ్రపాలి పెళ్ళి ఫోటోలు

వరంగల్ ఉభయ జిల్లాల కలెక్టర్ ఆమ్రపాలి వివాహం జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ఆ రాష్ట్రానికి చెందిన ఐపిఎస్ అధికారి సమీర్ శర్మతో జరిగింది. వారి వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున వర్మగ్ల్ మున్సిపల్ కమీషనర్ శృతి ఓజా, ఎమ్మెల్యే అరూరి రమేష్, వరంగల్ అర్బన్ జిల్లా తెరాస అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ నెల 23న వరంగల్ అర్బన్ జిల్లా క్యాంప్ కార్యాలయంలో, 25న హైదరాబాద్ లో బంధుమిత్రులకు, ప్రముఖులకు  నూతన దంపతులు వివాహ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఆ తరువాత వారు ఈనెల 26 నుంచి మార్చి 7వరకు హనీమూన్ కు టర్కీ వెళతారు.