సంబంధిత వార్తలు
తెలంగాణా రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలు, నదులు, వంటకాలు, పండుగలు వాటి ప్రాశస్త్యం గురించి వివరిస్తూ ప్రభుత్వం రెండున్నర కోట్ల పుస్తకాలను అచ్చు వేయించబోతోంది. వాటిని ‘ఇంటింటికీ తెలుగు’ పేరుతో ఉగాది నుంచి రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగా అందజేయబోతోంది. తెలంగాణాకు సంబంధించిన అన్ని విషయాలు దీనిలో క్లుప్తంగా వివరించబడ్డాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, దేశపతి శ్రీనివాస్ తెలిపారు. మన తెలుగు బాషను ప్రోత్సహించడంతో పాటు తెలంగాణా ప్రజలందరికీ తమ రాష్ట్రం..దాని విశిష్టతల గురించి తెలుసుకొనేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందని వారు తెలిపారు.