కోదండరాం వాహనం డ్డీకొని ఇద్దరికి గాయాలు

ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో “నాలుగేళ్ళ తెలంగాణాలో నల్లగొండ’ అనే అంశంపై ఒక సదస్సు జరిగింది. టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం దానిలో పాల్గొని హైదరాబాద్ తిరిగి వెళుతున్నప్పుడు, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివార్లవద్ద హైవేరోడ్డుపై ఒక బైకును డ్డీ కొంది. ఆ ప్రమాదంలో దానిపై ప్రయాణిస్తున్న చూల్లూరి మధు, లడే మహేష్ అనే యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రొఫెసర్ కోదండరాం ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకువెళ్ళి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో కోదండరాంకు చిన్న గాయం కూడా కాలేదు. టిజెఎసి నేతలు ఏర్పాటు చేసిన మరొక వాహనంలో చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్ తిరిగివెళ్ళి పోయారు.