నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో ఆరుగురురు నిందితులకు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి శ్రీనివాస్ హత్య చేయబడ్డారు. పోలీసులు దర్యాప్తు జరిపి దామలూరి సతీష్, మండ్ర మహేష్, మాతంగి మోహన్, ప్రసాద్, మెరుగు గోపి, మిట్టపల్లి సాయిలను అరెస్ట్ చేశారు. వారు బెయిల్ దరఖాస్తును కోర్టు ఆమోదించడంతో అందరూ నేడు జైలు నుంచి విడుదలై బయటకు రాబోతున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్. కనుక తన అనుచరుడి హత్యపై చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. తెరాస ఎమ్మెల్యే వీరేశం ఈ హత్య చేయించారని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ శ్రీనివాస్ భార్య లక్ష్మి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ సమయంలో హత్య కేసులో అరెస్ట్ చేసిన నిందితులు అందరూ బెయిల్ పై విడుదలై బయటకురావడంతో కాంగ్రెస్ నేతలు మళ్ళీ తెరాసపై విమర్శలు గుప్పించడం ఖాయం.