కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరాలకు సాధారణ బడ్జెట్ తో బాటు రైల్వే బడ్జెట్ ను కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రైల్వే బడ్జెట్ లో ముఖ్యాంశాలు ఇవే:
1. రైల్వేలకు రూ.1,48,000 కోట్లు
2. దేశవ్యాప్తంగా 18,000 కిమీ రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనులకు నిధులు మంజూరు.
3. దేశవ్యాప్తంగా కొత్తగా 4,000 కిమీ రైల్వే మార్గాల నిర్మాణం.
4. దేశవ్యాప్తంగా 600 రైల్వే స్టేషన్ల అభివృద్ధి.
5. రోజుకు 25,000 మంది ప్రయాణికులు వచ్చే ప్రతీ రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్స్ నిర్మాణం.
6. అన్ని రైల్వే స్టేషన్లలో సిసి టీవిలు, ఉచిత వైఫై సౌకర్యం కల్పించబడుతుంది.
7. కొత్తగా 12,000 రైల్వే వేగన్లు, 5,160 రైల్వే కోచ్ లు, 700 లోకో మోటివ్స్