హైకోర్టును ఆశ్రయించిన బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్య

ఇటీవల నల్లగొండలో కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ కేసులో పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయడంలేదని అనుమానం వ్యక్తం చేస్తూ శ్రీనివాస్ భార్య లక్ష్మి బుధవారం హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ కేసును సిబిఐ లేదా సిట్ చేత దర్యాప్తు చేయించాలని ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల కాల్ డేటా ఇప్పించాలని ఆమె తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. ఆమె పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, నల్లగొండ ఎస్పికి నోటీసు జారీ చేసి మూడు వారాలలోగా దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోరింది.