ప్రస్తుతం నీటిపారుదల శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్ శైలేంద్ర కుమార్ జోషిని తెలంగాణా ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్.పి.సింగ్ పదవీకాలం నేటితో ముగుస్తుంది కనుక రేపటి నుంచి ఆయన స్థానంలో శైలేంద్ర కుమార్ జోషి బాధ్యతలు చేపట్టబోతున్నారు.
1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శైలేంద్ర కుమార్ జోషి, 1977-1981 వరకు రూర్కెలా ఐఐటిలో ఇంజనీరింగ్ చేశారు. ఆ తరువాత డిల్లీ ఐఐటిలో పిజి చేశారు. అనంతరం అయన నెల్లూరు, వికారాబాద్, కృష్ణా జిల్లాలలో పనిచేశారు. ఆ తరువాత నీతిపారుదల, మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖలలో కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి హోదాలలో పనిచేసి అన్ని శాఖలలో అపారమైన అనుభవం గడించారు.