వరంగల్ ఉభయ జిల్లాల కలెక్టర్ ఆమ్రపాలి గణతంత్రదినోత్సవం రోజున ప్రసంగిస్తున్నప్పుడు, తడబడటం, మద్యమద్యలో ప్రసంగం ఆపి నవ్వడంపై మీడియాలో విమర్శలు రావడంతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ ఆమెకు ఫోన్ చేసి మందలించినట్లు ఎలుస్తోంది. తనకు తెలుగు సరిగా రానందునే ప్రసంగంలో తడబడ్డానని, తన తడబాటును ఆపుకోలేకనే నవ్వొచ్చింది తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదని కలెక్టర్ ఆమ్రపాలి సంజాయిషీ చెప్పినట్లు తెలుస్తోంది.
ఆమె ప్రసంగ పాఠంలో తెలుగు పదాలను చదవలేక తడబడితే ఎవరూ ఆమెను తప్పు పట్టి ఉండేవారు కారు కానీ అందుకు ఆమె ముసిముసినవ్వులు నవ్వడమే ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. ఇటువంటి చిన్న పొరపాటు వలన ఎటువంటి వ్యతిరేకత ఏర్పడుతుందో ఆమె గ్రహించారు కనుక మళ్ళీ ఇటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తపడితే మంచిది.