తెరాస సర్కార్ చేయని పని ప్రతిపక్షాలు చేశాయి

ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని డిల్లీ తీసుకువెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశపరచాలని ప్రతిపక్షాలు చాలా రోజులుగా కోరుతున్నాయి. దానికోసం పోరాడుతున్న ఎం.ఆర్.పి.ఎస్. నాయకుడు మందకృష్ణ మాదిగ రెండుసార్లు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. అయినా తెరాస సర్కార్ స్పందించలేదు. దాంతో ప్రతిపక్షాలే సోమవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొన్నాయి. ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిటిడిపి నాయకుడు ఎల్ రమణ, టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, గద్దర్, చెరుకు సుధాకర్ తదితరులు హాజరయ్యారు. ఒకవేళ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికీ తమను డిల్లీ తీసుకువెళ్ళకపోతే తామందరం కలిసి డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కలవాలని నిర్ణయించారు. మరి ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందిస్తారో లేదో చూడాలి.