ముఖ్యమంత్రి కెసిఆర్ ఈసారి మేడారం జాతరలో పాల్గొనబోతున్నారు. జాతర ముగింపు రోజున అంటే ఫిబ్రవరి 2న అయన మేడారం వచ్చి సమ్మక్క సారలమ్మవారిని దర్శించుకొంటారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ జాతరలో కోటిమందికిపైగా భక్తులు తరలివస్తారు కనుక ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
మేడారంలో బి.ఎస్.ఎన్.ఎల్. ఉచిత వైఫీ:
మేడారం జాతరలో బి.ఎస్.ఎన్.ఎల్. ఉచిత వైఫీ సౌకర్యం కల్పించబోతోంది. అందుకోసం వరంగల్ నుంచి మేడారం వరకు గల 22 టవర్స్ కు అదనంగా మేడారంలో 17 తాత్కాలిక టవర్లు ఏర్పాటు చేసింది. మేడారంలో 20 హాట్ స్పాట్ లు, 80 యాక్సెస్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్లు బి.ఎస్.ఎన్.ఎల్. అధికారులు తెలిపారు. ఏ నెట్ వర్క్ కు చెందిన వినియోగదారులైనా రోజుకు 500 ఎం.బి.పి.ఎస్. డేటా ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఒకేసారి మూడు లక్షల మంది ఉచిత వైఫై ఉపయోగించుకొన్నా హ్యాంగ్ అవకుండా పనిచేసేవిధంగా ఏర్పాట్లు చేసినట్లు బి.ఎస్.ఎన్.ఎల్. అధికారులు తెలిపారు.