‘సూర్యుడు’ కి నివాళి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న విజయవాడలో ‘సూర్యారాధన కార్యక్రమం’ సందర్భంగా సూర్యుడి గురించి చెప్పిన కొన్ని విషయాలు వింటే ఆశ్చర్యపోకుండా ఉండలేము. 

1. మన రాష్ట్రం తూర్పు భాగాన్న ఉన్నందున దేశంలో మొట్ట మొదట మన రాష్ట్రంలోనే సూర్యుడు ఉదయిస్తాడు. కనుక సూర్యుడే మన ‘బ్రాండ్ అంబాసిడర్.’ 

2. సూర్యకాంతి వలన అనేక ప్రయోజనాలున్నాయి.    

3. సూర్యుడి వలన డి-3 విటమిన్ లభిస్తుంది. శరీరంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయి. 

4. సూర్యకాంతితో ఇప్పుడు మనం సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకొనే స్థాయికి ఎదిగాము.   

5. సూర్యుడు జస్టిస్ చక్రవర్తి వంటివాడు. ధనిక, పేద అనే భేదం లేకుండా అందరికీ సమానంగా వెలుగులు పంచుతాడు. సమానంగా ప్రయోజనాలు అందిస్తాడు.

6. సూర్యుడు క్రమశిక్షణకు మారుపేరు. సూర్యుడిని నమ్ముకొంటే ఒక్క క్షణం కూడా పనులు ఆలశ్యం కావు.

కనుక అందరూ సూర్యుడిని ఆదర్శంగా తీసుకోవాలి. 

7. సూర్యుడి అంత క్రమశిక్షణగా పాటిస్తే అదే మనం సూర్యుడికి ఇచ్చే నివాళి.