రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పంచాయితీల పదవీకాలం జూలై 31వరకు ఉంది. కానీ ఫిబ్రవరి మొదటివారంలోనే ముందస్తు ఎన్నికలు జరిపించినట్లయితే, వాటిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలకు సమయం ఉండదు కనుక తెరాస అవలీలగా విజయం సాధించగలదని ముఖ్యమంత్రి కెసిఆర్ భావించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ఆలోచన విరమించుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో గల 83 శాసనసభ నియోజక వర్గాలలో ఓటర్ల జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 23న షెడ్యూల్ విడుదల చేసింది. దాని ప్రకారం ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ మార్చి 24తో పూర్తవుతుంది. కనుక ఆలోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదు. కనుక ఆ తరువాతే పంచాయితీ ఎన్నికల నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.