
టాలీవుడ్ లో క్రేజీ డైరక్టర్ గా సుకుమార్ కు మంచి క్రేజ్ దానితో పాటు డిమాండ్ ఉన్నా సినిమాను అనుకున్న టైంకు అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయడు అన్న అపవాదం కూడా ఉంది. తీసేది ఎలాగు స్టార్ సినిమా రాబట్టేయొచ్చు అన్న సుక్కు ఆలోచన ఎక్కడో దెబ్బ కొడుతుంది. ప్రస్తుతం రాం చరణ్ తో రంగస్థలం సినిమా చేస్తున్న సుకుమార్ ఆ సినిమాకు అనుకున్న దానికన్నా బడ్జెట్ శృతిమించిందని టాక్.
అందుకే చరణ్ ఇన్వాల్వ్ అయ్యి తన రెమ్యునరేషన్ లో కొంత తగ్గించుకున్నాడని టాక్. సినిమా క్వాలిటీ పరంగా బాగా రావాలనే ఉద్దేశంతో చరణ్ ఈ గ్రేట్ డెశిషన్ తీసుకున్నాడట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. సుకుమార్ సినిమాలు భారీగా ఉంటాయని తెలుసు కాని బడ్జెట్ భరించలేక హీరో రెమ్యునరేషన్ తగ్గేలా చేస్తాడని మాత్రం ఎవరు ఊహించి ఉండరు. మరి చరణ్ ఇంతా చేసి ఆశలు పెట్టుకున్న రంగస్థలం సినిమాను ఏం చేస్తాడో చూడాలి.