
కెన్ అండ్ గ్యాంగ్ స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా ‘యూత్.’ పేరుకు తగ్గట్లుగానే ఇది టీనేజ్ యూత్‌ఫుల్ స్టోరీ.. ప్రేమలు, అల్లర్లు, ఇంట్లో పెద్దల ఆందోళనలు కామన్! ఈ రోజు విడుదలైన యూత్ ట్రైలర్‌లో అవన్నీ ఉన్నాయి. కనుక యూత్ ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఈ సినిమాతో బాగా కనెక్ట్ అవుతారు. అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం, నటన: కెన్ అండ్ గ్యాంగ్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కోరియోగ్రఫీ: శోబి పౌల్ రాజ్, కెమెరా: వికీ, ఆర్ట్: రాము తంగరాజ్, స్టంట్స్: కలి కింగ్ సన్, ఎడిటింగ్: నాష్ చేశారు.
ఈ సినిమాని కరుప్పై సి. రామ్, సులోచన కుమార్ కలిసి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కాబోతోంది.