సంక్రాంతికే మాస్ రాజా..!

ఫాంలో ఉన్నప్పుడే డేర్ స్టెప్ వెయ్యాలి అన్నట్టుగా రెండేళ్ల గ్యాప్ తో వచ్చి రాజా ది గ్రేట్ తో రవితేజ ది గ్రేట్ అనిపించుకున్నాడు. స్టార్ హీరో అది కూడా అంధుని పాత్రలో అబ్బో పెద్ద రిస్కే చేసిన మాస్ రాజా ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న టచ్ చేసి చూడు సినిమాను కూడా త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. రీషూట్లతో కాస్త లేట్ అయినా సినిమా బాగానే వచ్చిందని టాక్.

విక్రం సిరి డైరక్షన్ లో వస్తున్న టచ్ చేసి చూడు సినిమాను రాబోయే సంక్రాంతి బరిలో దించేయాలని చూస్తున్నాడట రవితేజ. రాజా సక్సెస్ ను కంటిన్యూ చేసేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే పొంగల్ వార్ లో ఇప్పటికే పవన్, బాలకృష్ణ సినిమాలు వస్తున్నాయి. మరి ఈ రెండిటి పోటీకి తట్టుకుని మాస్ రాజా నిలబడుతాడో లేదో  చూడాలి. హాలీడేస్ బాగానే ఉంటాయి కాబట్టి రవితేజ కరెక్ట్ కంటెంట్ తో వస్తే తప్పకుండా హిట్ కొట్టే చాన్స్ ఉంది.