
ఎన్.టి.ఆర్ హోస్ట్ గా తెలుగులో సక్సెస్ అవుతుందో లేదో అనుకున్న బిగ్ బాస్ సీజన్ వన్ సూపర్ సక్సెస్ అయ్యింది. మొదట కంటెస్టంట్స్ మాములు వాళ్లే అనిపించినా సీజన్ పూర్తయ్యే సరికి వాళ్లే సెలబ్రిటీస్ అయ్యారు. వారాంతరం ఎంత తారక్ నడిపించినా వారం మొత్తం ఎలాగోలా షోకి క్రేజ్ వచ్చేలా చేశారు. ఇక బిగ్ బాస్ సీజ వన్ విన్నర్ గా శివ బాలాజి అదరగొట్టగా.. మధ్యలో వచ్చినా చివరిదాకా చలాకీగా ఉన్నాడు నవదీప్.
ఈ ఇద్దరు కలిసి చందమామ సినిమాలో చేశారు. ఇప్పుడు మళ్లీ ఆ ఇద్దరిని పెట్టి ఓ మల్టీస్టారర్ తీయాలని చూఒస్తున్నారట. బిగ్ బాస్ క్రేజ్ తో ఇద్దరికి మంచి మైలేజ్ ఏర్పడింది. ఓ నూతన దర్శకుడు ఈ ఇద్దరికి సూట్ అయ్యే కథ రాశాడట. దాన్ని ఇద్దరికి వినిపించగా ఓకే చెప్పాడని టాక్. ఓ బడా నిర్మాణ సంస్థ ఈ సినిమా నిర్మిస్తుందని సమాచారం. మొత్తానికి బిగ్ బాస్ కంటెస్టంట్స్ మల్టీస్టారర్ మూవీ త్వరలో షురూ అవనుంది. మరి ఈ సినిమా ఎలాంటి క్రేజ్ ఏర్పరచుకుంటుందో చూడాలి.