
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హారీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దువ్వాడ జగన్నాధం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా కేవలం రెండు పాటల మినహా పూర్తి కావొచ్చింది. అయితే సినిమా చేస్తున్న సమయంలోనే హరీష్ శంకర్ ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా చేయాలనే ఆలోచన వచ్చిందట.
కథను డిజెతో పూర్తి చేసి క్యారక్టరైజేషన్ కంటిన్యూ చేస్తూ వేరే కథతో డిజె పార్ట్-2 తీస్తారట. ఇప్పటికే ఆ లైన్ కూడా హరీష్ అల్లు అర్జున్ తో డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. జూన్ 23న డిజె రిలీజ్ అవబోతుంది ఇక సినిమా హిట్ అయితే కనుక మళ్లీ సెకండ్ పార్ట్ కన్ఫాం అంటున్నారు చిత్ర వర్గాలు. మొత్తానికి బాహుబలి లా డిజె కూడా పార్ట్ 1,2 లుగా రాబోతుందన్నమాట. ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.