
సినిమాలలో, టీవీ రియాల్టీ షోలు, రాజకీయాలలో రాణించిన రోజా... పరిచయం అవసరం లేని పేరు. ఇదివరకు ఏపీ రాజకీయాలలో, తర్వాత మంత్రిగా బిజీగా ఉండటం వలన సినీ పరిశ్రమకు దూరమయ్యారు. కానీ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నందున ఆమెకు మళ్ళీ సమయం చిక్కింది. కనుక మళ్ళీ సినిమాలలో నటించడం ప్రారంభించారు. కానీ 12 ఏళ్ళ తర్వాత ఆమె నటిస్తున్న తొలి సినిమా తెలుగులో కాదు తమిళంలో!
కోలీవుడ్లో బాల చంద్రన్ దర్శకత్వంలో ‘లెనిన్ పాండియన్’ అనే తమిళ సినిమాలో రోజా ‘సంతానం’ అనే గ్రామీణ మహిళగా నటిస్తున్నారు.
ఈ సినిమా క్లిప్పింగ్ ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాను మళ్ళీ సినిమాలలో నటిస్తున్నట్లు అభిమానులకు తెలియజేశారు. మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత ఆమె తమిళ సినీ పరిశ్రమకి తిరిగి వస్తునందుకు తమిళ నటి కుష్బూ, ప్రభుదేవా ఆమెకు స్వాగతం చెపుతూ ట్వీట్ చేశారు.
Thank you so much @PDdancing master 🫶 https://t.co/VJaV6r6Ly1
— Roja Selvamani (@RojaSelvamaniRK) November 5, 2025