
ఇంతవరకు వరుసపెట్టి తెలుగు సినిమాలు చేస్తున్న శ్రీలీల తొలిసారిగా తమిళ సినిమా ‘పరాశక్తి’లో హీరోయిన్‌గా నటించింది. సుధా కొంగర దర్శకత్వంలో తమిళ నటుడు శివ కార్తికేయన్, శ్రీలీల జంటగా ఈ సినిమాని తమిళ్, తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ సినిమా నుంచి ‘సింగారాల సీతాకోకచిలుక..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ గురువారం విడుదలయ్యింది.
భాస్కర భట్ల వ్రాసిన ఈ పాటకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ఎల్.వీ. రేవంత్, డీ, సియాన్ రోల్దాన్ కలిసి పాడారు.
పరాశక్తి ఒకప్పటి సినిమా ఇండస్ట్రీలో జరిగే సంఘటనలు ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రవిమోహన్, అధర్వ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుధా కొంగర, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: రవి కె చంద్రన్, ఎడిటింగ్:సతీష్ సూర్య, ఆర్ట్: ఎస్. అన్నాదురై, స్టంట్స్: సుప్రీం సుందర్ చేస్తున్నారు.
రెడ్‌బుక్ జయంట్ మూవీస్ సమర్పణలో డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ పరాశక్తి సినిమా తీస్తున్నారు. ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది.