స్టార్ హీరో మీద పోలీస్ కంప్లైంట్..!

సౌత్ లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో కోలీవుడ్ హీరో విజయ్ ఒకరు. దాదాపు సూపర్ స్టార్ రజిని తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న విజయ్ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకున్నాడు. అది కూడా తను ఏం చేయకుండానే ఫ్యాన్స్ చేసిన తప్పిందం వల్ల ఇళయదళపతి విజయ్ కష్టాల్లో పడ్డాడు. విజయ్ చేస్తున్న సినిమాలకు ముందే ఫోటో షూట్ చేయడం బాగా అలవాటైంది ఫ్యాన్స్.

ఇక ఆ అత్యుత్సాహంతోనే విజయ్ త్రిశూలం పట్టుకుని నటరాజ గెటప్ లో నిలబడినట్టు ఓ పిక్ సోషల్ మీడియాలో వచ్చింది. అయితే ఫ్యాన్ మేడెడ్ గా వచ్చిన ఈ పిక్ లో విజయ్ షూస్ ధరించడం వివాదానికి దారి తీసింది. హిందూ మక్కల్ మున్నని పార్టీ ఈ ఫోటో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విజయ్ పై కేసు నమోదు చేశారు. ఆ ఫోటోకి విజయ్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా సరే ఫ్యాన్స్ వల్ల విజయ్ ఈ గొడవలో ఇరుక్కున్నాడు.