రామ్ చరణ్ రామాయణం..!

బాహుబలి స్పూర్తిగా తీసుకుని 500 కోట్లతో రామాయణం తీస్తున్నట్టు ప్రకటించారు అల్లు అరవింద్. మెగా ఫ్యామిలీ హీరోలే రాముడిగా నటిస్తారని తెలిసిందే. ఈ క్రమంలో కొందరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాముడిగా నటిస్తాడని అంటుంటే మరికొందరు మెగా పవర్ స్టార్ రాం చరణ్ రాముడిగా చేస్తాడని అంటున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ అయితే ఈ ఉత్సాహంలో రామాయణంలో రాం చరణ్ ను హీరోగా పెట్టేసి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 


మగధీరలోని రాం చరణ్ లుక్ తో వచ్చిన ఈ రామాయణం పోస్టర్ నిజంగా చిత్రయూనిట్ డిజైన్ చేసినట్టే అద్భుతంగా ఉంది. ఇంకా హీరో ఎవరో ఫైనల్ కాని రామాయణం సినిమాకు హీరో రాం చరణ్ అని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మరి చెర్రిని కాదని వేరే ఎవరినైనా పెడితే ఎలాంటి హంగామా చేస్తారో మరి. ప్రస్తుతం సుకుమార్ తో సినిమా చేస్తున్న చరణ్ ఆ తర్వాత సినిమా ఏది కన్ ఫాం చేయలేదు. మరో పక్క బన్ని కూడా డిజె తర్వాత ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. మరి ఇద్దరిలో రాముడు ఎవరో కొద్దిరోజుల్లో తెలుస్తుంది. రామాయణం ఫ్యాన్స్ మేడ్ పోస్టర్ మాత్రం అందరిని అలరిస్తుంది.