
చందమామగా తెలుగు తెరమీద తన అందం అభినయంతో అలరించిన కాజల్ అగర్వాల్ తెలుగు తెరకు తొలిపరిచయం అయ్యింది తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతోనే.. నందమూరి కళ్యాణ్ రాం హీరోగా నటించిన ఆ సినిమా అమ్మడికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత వరుస హిట్లతో అమ్మడు స్టార్ రేంజ్ కు ఎదిగిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మరోసారి తన తొలి సినిమా హీరో కళ్యాణ్ రాం తో సినిమా చేయనుందట కాజల్. తొలి సినిమా దర్శకుడు తేజతో ప్రస్తుతం సినిమా చేస్తున్న కాజల్ అదే ప్రొడక్షన్ లో కళ్యాణ్ రాం హీరోగా మరో సినిమాలో నటిస్తుందట. కళ్యాణ్ రాం తో కాజల్ ఇదో మంచి క్రేజీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది కొద్దిరోజుల్లో ఎనౌన్స్ చేస్తారట. ఈ సినిమాపై కళ్యాన్ రాం కూడా చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నట్టు తెలుస్తుంది.