మరోసారి జనతా కాంబినేషన్..!

సూపర్ హిట్ కాంబినేషన్ లో సినిమా అంటే ఆడియెన్స్ లో మస్త్ మజా ఉంటుంది. ఈ క్రమంలో స్టార్ హీరో స్టార్ డైరక్టర్ సినిమా అనగానే ఇక ఫ్యాన్స్ అంచనాలకు అవధులుండవు. ప్రస్తుతం అలాంటి క్రేజీ కాంబినేషన్ మరోసారి సినిమా చేయబోతున్నారు. ఇక ఆ కాంబినేషన్ ఎవరిది అంటే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, కొరటాల శివలదని తెలుస్తుంది. జనతా గ్యారేజ్ తో ఈ ఇద్దరు కలిసి సృష్టించిన సంచలనం తెలిసిందే.

టెంపర్, నాన్నకు ప్రేమతో తర్వాత తారక్ చేసిన ఈ సినిమా తన కెరియర్ లో బిగ్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఇక మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లతో స్టార్ డైరక్టర్ గా ఎదిగిన కొరటాల శివ ప్రస్తుతం మహేష్ తో భరత్ అనే నేను సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత మళ్లీ తారక్ తోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. సో జనతా గ్యారేజ్ కాంబోలో రాబోతున్న ఆ మూవీ కచ్చితంగా మరోసారి సంచలన రికార్డులను సృష్టిస్తుందని చెప్పొచ్చు.