
ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి కన్ క్లూజన్ ఇంకా సంచలనాలను సృష్టిస్తూనే ఉంది. రీసెంట్ గా 1000 కోట్ల మార్క్ క్రాస్ చేసిన మొదటి ఇండియన్ సినిమాగా రికార్డ్ సృష్టించిన బాహుబలి ఇప్పుడు కేవలం ఇండియాలోనే 1000 కోట్లు కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా 1300 కోట్ల కలక్షన్స్ సాధించిన బాహుబలి కేవలం ఇండియాలోనే 1000 కోట్లను రీచ్ అయ్యింది.
తెలుగు రాష్ట్రాల్లో 300 కోట్లు, హిందిలో 400 కోట్లతో వసూళ్ల హవా కొనసాగించిన బాహుబలి తమిళంలో 100 కోట్లను కొల్లగొట్టింది. ఇక మలయాళ కన్నడ భాషలతో కలుపుకుని ఇండియాలోనే 1000 కోట్ల గ్రాస్ అందుకుంది. యూఎస్ లో కూడా బాహుబలి వసూళ్ల దండయాత్ర కొనసాగిస్తుంది.. దాదాపు 100 కోట్లకు పైగా వసూళు చేసినట్టు తెలుస్తుంది. ఇక మిగతా కంట్రీస్ లో కూడా బాహుబలి కలక్షన్స్ బహుపరాక్ అనేలా ఉన్నాయి.