
బాహుబలితో ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రతిఒక్కరికి తెలుసు.. కేవలం సినిమాలే కాదు వాణిజ్య ప్రకటనల కోసం కూడా ప్రభాస్ తో చేయించేందుకు క్యూ కడుతున్నారు. బాహుబలి బిగినింగ్ తర్వాత కేవలం మహింద్రా వెహికల్ కు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ప్రభాస్ ఇప్పుడు మరికొన్ని ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయనున్నాడట. ఇక వీటితో పాటుగా ఓ కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు 18 కోట్ల ఆఫర్ ఇచ్చినా సరే ఎందుకో దాన్ని కాదనేశాడట ప్రభాస్.
ఎమౌంట్ విషయంలో తేడా కొట్టిందో లేక ఆ ప్రొడక్ట్ కు అంబాసిడర్ గా ఉండటం నచ్చలేదో కాని ప్రభాస్ మాత్రం ఆ కంపెనీ వారికి షాక్ ఇచ్చాడట. ప్రస్తుతం ప్రభాస్ మరో ఫోర్ వీలర్ యాడ్ తో పాటుగా ఓ డియో డ్రండ్ యాడ్ కూడా ఓకే చెప్పాడట. అమెరికా పర్యటన నుండి తిరిగి రాగానే ప్రభాస్ యాడ్ షూట్ లో పాల్గొంటాడట. సౌత్ లో మహేష్, అల్లు అర్జున్ ల తర్వాత ఆ రేంజ్ లో వాణిజ్య ప్రకటనలు చేసే హీరోగా ప్రభాస్ కొత్త రికార్డ్ సృష్టించబోతున్నాడు.