పెళ్లిచూపులు హీరో జాక్ పాట్ కొట్టాడు..!

మొదటి సినిమా ఎవడే సుబ్రమణ్యంలో సపోర్టెడ్ రోల్ చేసి వెంటనే పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ దక్కించుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ ఆ హిట్ మేనియాను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా వచ్చిన ద్వారకా కూడా పర్వాలేదు అనిపించుకుంది కాబట్టి విజయ్ తో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. పెళ్లిచూపులు పెద్ద హిట్ అవడంతోనే అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ సెకండ్ బ్యానర్ లో ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు.

బన్ని వాసు నిర్మిస్తున్న ఈ సినిమాను సోలో, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో హిట్ అందుకున్న పరశురాం డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక సినిమాలో హీరోయిన్ గా మలయాళ భామ మడోన్నా సెబాస్టియన్ ను ఓకే చేశారట. మలయాళ ప్రేమంలోనే కాదు తెలుగు ప్రేమంలో కూడా నటించి ఆడియెన్స్ మనసు దోంచిన ఈ సుందరి ఇప్పుడు విజయ్ దేవరకొండతో రొమాన్స్ కు రెడీ అయ్యింది. కోలీవుడ్ లో రీసెంట్ గా పవర్ పాండిలో నటించి మెప్పించిన మడోన్నా తన సక్సెస్ ట్రాక్ కొనసాగిస్తూ ఉంది. మరి తెలుగులో డైరెక్ట్ గా చేస్తున్న ఈ సినిమాతో కూడా హిట్ అందుకుంటుందేమో చూడాలి.