
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ తెలుగు హీరో గురించి పెద్ద చర్చే నడుస్తుంది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పి 1000 కోట్లు దాటిన మొదటి భారతీయ సినిమాగా ప్రభంజనం సృష్టించిన బాహుబలి సినిమా దర్శకుడు ఎవరని ఓ తెలుగు హీరో అడిగాడట.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పులి సినిమాలో నటించిన నిఖిషా పటేల్ ఈ విషయం తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా వెల్లడించింది.
బాహుబలి చూశావా అని అమ్మడు అడుగగా సదరు హీరో బాహుబలి డైరక్టర్ ఎవరు అని అడిగాడట. ఇక ఇదే విషయాన్ని ట్విట్టర్ లో ఎనౌన్స్ చేసి ఆ హీరోని బండ బూతులు తిట్టింది నిఖిషా పటేల్. బాహుబలి లాంటి సినిమా గురించి పరభాషా ప్రముఖులే చాటింపేసిమరి చెప్పుకుంటుంటే తెలుగు హీరో అయ్యుండి ఆ సినిమా గురించి దర్శకుడు రాజమౌళి ఎవరు అని అన్నాడంటే ఇక ఆ హీరో ఆలోచనలు ఎక్కడ ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఆమె పేరు బయటపెట్టలేదు కాబట్టి సరిపోయింది లేదంటే బాహుబలి ఫ్యాన్స్, రాజమౌళి ఫ్యాన్స్ ఆ హీరో మీద పగ తీర్చుకునే వారు.