500 కోట్ల బడ్జెట్ తో రామాయణం..!

బాహుబలి సినిమా తర్వాత ప్రతి ఒక్క నిర్మాత అలాంటి సినిమా తీయాలనే ఆలోచన రావడం మాములే. ఆ ముందడుగు మళ్లీ తెలుగు పరిశ్రమ నుండే పడటం విశేషం. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ 500 కోట్ల భారీ బడ్జెట్ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇంతకీ వీరు తీయబోయే సినిమా ఏంటి అంటే రామాయణం అని తెలుస్తుంది.   

అల్లు అరవింద్ తో పాటుగా ఈ ప్రాజెక్ట్ లో నమిత్ మల్హోత్రా, మధు మాతెన నిర్మాతలుగా ఉంటున్నారు. ఇక ఈ సినిమా డైరక్టర్ ఎవరు.. స్టార్ కాస్ట్ ఎవరు అన్నది ఇంకా తెలియలేదు. ఈరోజే డెశిషన్ ఫైనల్ అవడంతో ఈ న్యూస్ బయటకు వచ్చింది. బాహుబలిని మించిన సినిమా మళ్లీ తెలుగులోనే రావడం అందరిని ఆనందింపచేసే విషయమని చెప్పొచ్చు. సినిమా మాత్రం త్రిడి ఫార్మేట్ లో తీయాలని చూస్తున్నారు. మూడు సీరీస్ లుగా ఉంటుందని తెలుస్తుంది.