వంశీ ఈసారి మెప్పించేలా ఉన్నాడు..!

సీనియర్ డైరక్టర్ వంశీ సినిమాలంటే ఒకప్పుడు ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ బాగా ఉండేది. అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడే వంశీ సినిమాలు ఈమధ్య ఆడియెన్స్ కు రుచించట్లేదు. సినిమా టేకింగ్ పరంగా వంశీ వెనక్కి తగ్గాడని అనిపించింది. అందుకే తన కెరియర్ లో సూపర్ హిట్ అయిన లేడీస్ టైలర్ సినిమాకు సీక్వల్ గా ప్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

ఇప్పటికే ఆన్ లైన్ లో సాంగ్స్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ కొద్దినిమిషాల క్రితం ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది. టీజర్ మాత్రం అదరగొట్టేసింది. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మధురా శ్రీధర్ నిర్మిస్తున్నారు. టీజర్ తో హైప్ క్రియేట్ చేస్తున్న ప్యాషన్ డిజైనర్ వంశీ ఖాతాలో ఓ హిట్ కూడా పడేలా చేయాలని ఆశిద్దాం.