
ఓ సినిమా హిట్ అయితే ఆ హాట్ పెయిర్ మీద అందరి కన్ను ఉంటుంది. వారి ఆన్ స్క్రీన్ కాంబినేషన్ బాగా వర్క్ అవుట్ అయితే ఇక ఆఫ్ స్క్రీన్ లో కూడా అది కంటిన్యూ చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ హాట్ పెయిర్ మీడియా కంట పడింది. ఇంకేముంది సోషల్ మీడియాలో వారే ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండింగ్ లో ఉన్నారు. ఇంతకీ ఎవరా జంట అంటే.. పెళ్లిచూపులు హీరో హీరోయిన్స్ విజయ్ దేవరకొండ, రీతు వర్మ అని తెలుస్తుంది.
ఒక్క హిట్ తో తమ ఫేట్ మార్చుకున్న ఈ ఇద్దరు ఆ సినిమా టైంలో చాలా క్లోజ్ అయ్యారని చెప్పనక్కర్లేదు. అందుకే రీసెంట్ గా జరిగిన విజయ్ బర్త్ డే పార్టీలో అమ్మడు అతనితో సరదాగా చిందులేసింది. ఓ చేత్తో బీర్ మరో పక్క అమ్మాయి ఆహా విజయ్ దేవరకొండ మస్త్ జబర్దస్త్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇద్దరి వ్యవహారం చూస్తుంటే వారి మధ్యలో ఏదో స్ట్రాంగ్ రిలేషన్ షిప్ నడుస్తుందని చెప్పొచ్చు. సినిమాలో ప్రేయసి కాబట్టి రియల్ లైఫ్ లో అంత చనువుగా ఉన్నారా అంటే అలా మూవ్ అవడం కాస్త కష్టమే కాని ప్రస్తుతం విజయ్ రీతు వర్మల ఈ పిక్ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా వెళ్తుంది.