
బాహుబలితో తన సత్తా ఏంటో చాటుకున్న దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తర్వాత సినిమా ఏంటి అన్నది ఇప్పుడు అందరు తెలుసుకోవాలనుకునే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ప్రస్తుతం భూటాన్ లో ఫ్యామిలీతో జాలీ ట్రిప్ వేసిన రాజమౌళి తన తర్వాత సినిమా ఏంటి అన్నది మాత్రం చెప్పలేదు. బాహుబలి లాంటి సినిమా తర్వాత కచ్చితంగా ఓ ప్రయోగాత్మక సినిమా చేస్తాడని అంటున్నారు.
అందులో హీరోగా నటించాలని స్టార్స్ సైతం రాజమౌళితో చర్చలు జరుపుతున్నారట. అంతేకాదు ఫ్యామిలీతో లాభియింగ్ కూడా చేయిస్తున్నారట కొందరు హీరోలు. ఇక అంతేకాదు నిర్మాతలు కూడా రాజమౌళి ఓకే అంటే ఎంత బడ్జెట్ అయినా పెట్టి సినిమా తీసేందుకు సిద్ధం అంటున్నారట. విజయేంద్ర ప్రసాద్, కీరవాణిలతో చెప్పించి మరి రాజమౌళితో సినిమా సెట్ చేయాలని అడుగుతున్నారట. సో మొత్తానికి బాహుబలి లాంటి హిస్టరీ క్రియేటెడ్ మూవీ సృష్టించిన రాజమౌళి తన తర్వాత సినిమా కోసం పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది.