
మిల్కీ బ్యూటీ తమన్నా బాహుబలి-2 సినిమా హిట్ అయినందుకు ఎంత సంతోషంగా ఉందో కన్ క్లూజన్ లో తన పాత్ర గుర్తుంపు లేకపోవడంతో అంతే బాధతో ఉంది. బాహుబలి-2 ప్రమోషన్స్ లో క్లైమాక్స్ లో తన పాత్ర చాలా ప్రాముఖ్యత ఉంటుందని చెప్పిన తమన్నా తీరా సినిమా చూస్తే కనీసం ఒక నిమిషం కూడా స్క్రీన్ మీద కనిపించలేదు.
ప్రమోషన్స్ లో ఓ రేంజ్ లో గొప్పగా చెప్పిన తమన్నా సినిమాలో తన రోల్ తక్కువవడంతో కాస్త షాక్ కు గురయ్యిందట. తమన్నాకు కూడా తన రోల్ ఇంత తక్కువగా ఉంటుందని తెలియదట. ఈ విషయంలో కోలీవుడ్ మీడియాతో రాజమౌళి తనకు అన్యాయం చేశాడని చెప్పిందట. మరళ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుందని అంటున్నారు. దేశం మొత్తం గర్వించేలా బాహుబలి సినిమా ప్రభజనాలు సృష్టిస్తుంటే ఆ సినిమాలో తాను భాగమైనందుకు సంతోషించకుండా తమన్నా లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.