నెంబర్ 1 స్థానంలో ప్రభాస్..!

బాహుబలి-2తో తిరుగులేని హీరోగా దేశ సిని ప్రియుల మనసు గెలుచుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ముఖ్యంగా తెలుగులో ఇప్పటిదాకా టాప్ చెయిర్ రేసులో లేని ప్రభాస్ సడెన్ గా బాహుబలి మొదటి రెండు పార్ట్ లతో ముందుకొచ్చాడు. బాహుబలి కన్ క్లూజన్ లో అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటన అదరిని ఆశ్చర్యపరుస్తుంది.   

రికార్డులను సృష్టించేలా ఏ హీరో సినిమా తీసినా టాప్ ప్లేస్ ఇచ్చేయడం కామనే. ఇక అదే క్రమంలో ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ప్రభాస్ అంటూ ప్రచారం చేస్తున్నారు అభిమానులు. బాహుబలి-2 సినిమా కలక్షన్స్ సృష్టిస్తున్న సునామి చూస్తే ఆ మాట నిజమనిపించక తప్పదు. కాని బాహుబలి విషయంలో ముందు రాజమౌళికి క్రెడిట్ దక్కుతుంది. అందుకే బాహుబలితో కాకుండా తన తర్వాత సినిమాతో కూడా ప్రభాస్ ఈ రేంజ్ ఫలితాన్ని అందుకుంటే కచ్చితంగా అప్పుడు నెంబర్ వన్ గా ఫిక్స్ చేసేయొచ్చు అంటున్నారు సిని పండితులు.